తెలంగాణ కోసం పోరాడుతాం: రాజ్ నాథ్

తెలంగాణ సున్నితమైన అంశమని, దీన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణ అంశంపై కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం జాప్యం చేస్తోందని, అది మంచిది కాదని ఆయన అన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ జాప్యం వల్ల యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 23వ తేదీన బిజెపి అనుబంధ విద్యార్థి సంఘం తెలంగాణ గర్జన సభను తలపెట్టింది. ఈ సభలో పాల్గొనడానికి ఆయన వచ్చారు. బిజెపి నాయకురాలు సుష్మా స్వరాజ్ కూడా ఈ సభలో పాల్గొంటారు. అయితే ఈ సభకు ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు.












Click it and Unblock the Notifications