హైదరాబాదులో సహజీవన్ రన్: కోదండరామ్

తెలంగాణపై కేంద్రం సీరియస్ గానే ఉందని, అయితే కేంద్ర నిర్ణయం వచ్చేదాకా ఆందోళన సాగించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కేంద్ర ప్రకటనలో స్పష్టత లేదని, స్పష్టత కోసం మరింత ఒత్తిడి తేవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమ తీవ్రతను గమనించి సీమాంధ్ర నేతలు సంయమనం పాటించాలని ఆయన కోరారు. ఆవేశకావేషాలకు లోనై సీమాంద్ర నేతలు విద్యార్థులను రెచ్చగొట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వచ్చిందని, అయితే కొంత మంది పెట్టుబడిదారులు దాన్ని అడ్డుకుంటున్నారని శాసనసభ్యుడు బస్వరాజు సారయ్య అన్నారు.












Click it and Unblock the Notifications