ఆంధ్రావాళ్లకి హైకమాండ్ లేదు, తెలంగాణకెందుకు: కెసిఅర్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీ జేఏసీ ఆధ్వర్యంలో 18 మంది ఈనెల 19న అక్కడ ప్రారంభించిన పాదయాత్ర శనివారం హైదరాబాద్‌కు చేరుకుంది. తొలుత రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌కు వినతిపత్రం సమర్పించాక వారు తెలంగాణ భవన్‌కు వచ్చారు.
పాదయాత్రికులను పులమాలలతో సత్కరించిన కేసీఆర్ అనంతరం మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఎన్టీపీసీ జేఏసీ పాదయాత్ర ఒక ఘట్టంగా మిగిలిపోతుందన్నారు. 'ఆంధ్రా కాంగ్రెస్ వాళ్లకు హైకమాండ్ లేదు..తెలంగాణ కాంగ్రెస్ వాళ్లకే హైకమాండా? మనం కూడా వాళ్లు ప్రయోగించిన రాజీనామా అస్త్రాన్నే ప్రయోగిద్దాం. కేంద్రానికి 28 వరకు గడువు ఇచ్చాం'' అన్నారు.












Click it and Unblock the Notifications