నెల్లూరు: తెలంగాణ విషయంలో తామంతా తమ నేత ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయానికే కట్టుబడి ఉంటామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని జెఎసిలతో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధంలేదని ఆయన చెప్పారు. ఉద్యమాల మాటున ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని మంత్రి ఆరోపించారు.
కాగా సోనియాగాంధీ తెలంగాణ విషయంలో స్పష్టమైన వైఖరిని ఇప్పట్లో వ్యక్తం చేసే అవకాశం లేదని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రం విడిపోయినా రెండు చోట్లా కాంగ్రెస్ అధికారంలో ఉండాలన్నది ఆమె అభిమతంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకుంటే ఇటు అంధ్రలోను, అటు తెలంగాణలోనూ కాంగ్రెస్ కు నష్టం జరిగే అవకాశాలను ఆమె విశ్లేషిస్తున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి