కెసిఆర్ వల్ల అఫ్గాన్ లా అయింది: ఆనం వివేకానంద రెడ్డి

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు వల్ల ఆంధ్రప్రదేశ్ మరో అఫ్గానిస్తాన్ లా మారిందని కాంగ్రెసు కోస్తాంధ్ర శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి వ్యాఖ్యానించారు. ఐపియల్ మ్యాచులు జరగడానికి ఆటంకాలు ఏర్పడడం దురదృష్టకరమని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. మ్యాచులు ఆడించుకోవడానికి ఐపియల్ కు చెందిన పెద్దలు కెసిఆర్ వద్ద, తెలంగాణ జెఎసి వద్ద చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమని ఆయన అన్నారు. వ్యక్తి కోసం, పదవుల కోసం జరుగుతున్నదే తప్ప తెలంగాణ కోసం జరుగుతున్న పోరాటం కాదని ఆయన వ్యాఖ్యానించారు.

తెలంగాణలో ఏం చేయాలన్నా కెసిఆర్ కుటుంబ సభ్యుల అనుమతి తీసుకోవాల్సి రావడం దురదృష్టకరమని, కెసిఆర్, ఆయన కుటుంబ సభ్యుల ఇష్టాల ప్రకారం వ్యవహరించాల్సి రావడం దారుణమని వివేకానంద రెడ్డి అన్నారు. దీనిపై తెలంగాణ నాయకులు ఆలోచించాలని ఆయన కోరారు. బెదిరింపులకు పాల్పడుతున్న కెసిఆర్ కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. షూటింగులు జరుపుకోవాలంటే కెసిఆర్ కూతురు, సాఫ్ట్ వేర్ కార్యకలాపాలకు అల్లుడు, మరో కార్యక్రమం కోసం కుమారుడి నుంచి అనుమతి తీసుకోవాల్సి రావడం దారుణమని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కెసిఆర్ కుటుంబ సభ్యుల ఇష్టంపై ఆధారపడడం బాధాకరమని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+