హైదరాబాద్: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఈ నెల 28వ తేదీలోగా స్పష్టమైన ప్రకటన చేయకపోతే తెలంగాణ ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేయాల్సిందేనని తెలంగాణ రాజకీయ జెఎసి కన్వీనర్ కోదండరామ్ అన్నారు. ఈ నెల 28వ తేదీలోగా కేంద్రం నుంచి ప్రకటన రాకపోతే 29వ తేదీన రాజీనామాలు చేయాలని సమిష్టిగా తీసుకున్న నిర్ణయమని, తెలంగాణ ప్రజాప్రతినిధులంతా దానికి కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణపై స్పష్టమైన ప్రకటనను డిమాండ్ చేస్తూ జెఎసి ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు బుధవారానికి 12వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడారు.
తెలంగాణపై ఈ నెల 28వ తేదీలోగా కాలపరిమితితో కూడిన ప్రకటన చేయాలని, లేకుంటే ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేస్తారని, ఇందులో మార్పు ఉండదని ఆయన అన్నారు. రాజీనామా చేస్తామని అన్ని పార్టీలు ప్రకటించాయని ఆయన గుర్తు చేశారు. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను పురస్కరించుకుని ఈ నెల 29వ తేదీన సెలవు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి