తుస్సుమన్న చిరంజీవి అనాసాగరం పర్యటన

Chiranjeevi
నందిగామ: ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవి పర్యటన అనాసాగరంవాసులకు ఒకింత ఊరటనిచ్చినప్పటికీ ఎటువంటి ఆర్థిక సాయం ప్రకటించకపోవటం వారికి నిరాశ కలిగించింది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెప్పటం తప్ప, పార్టీ తరఫున సహాయం ప్రకటించకుండానే చిరంజీవి వెళ్లిపోయారు. అనాసాగరానికి చెందిన 11 మంది ఇటీవల కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే.

ఒక్కొక్కరి ఇంటికి చిరంజీవి వెళ్లి కుటంబసభ్యులను ఓదార్చారు. జరిగిన ఘటన తమ కుటుం బాలను అంధకారంలోకి నెట్టి వేసిందని, ఆదుకోవాలని కోరుతూ చిరంజీవి కాళ్లపై పడి వారు భోరున విలపించారు. వారి కష్టాలు, బాధలను స్వయంగా విన్న చిరంజీవి చలించిపోయారు. ఓ దశలో అభిమానులు 'మెగాస్టార్‌ చిరంజీవి' అంటూ నినాదాలు చేస్తూ, ఈలలు వేస్తుండగా చిరంజీవి ఒకింత అసహనానికి లోనయ్యారు. తాను పార్టీ తరఫున గానీ, సినీ నటుని హోదాలో గానీ ఇక్కడకు రాలేదని, బాధితుల కష్టాలను తెలుసుకునేందుకు మాత్రమే వచ్చానని తెలి పారు. అభిమానులు ఓర్పు వహించి మౌనంగా ఉండాలని పదేపదే కోరారు. అయినప్పటికీ అభిమానులు అత్యుత్సాహం చూపి నాయకులు, పోలీసులను పక్కకు నెట్టివేయడంతో పలుసార్లు చిరంజీవి ఆగ్రహానికి గురయ్యారు.

చిరంజీవి గ్రామ పర్యటన గందరగోళంగా సాగింది. నిర్దిష్టమైన ప్రణాళిక లేకపోవటం, ముందుండి నడిపించే వారే కొరవడటంతో ఎవరింటికి వెళ్లాలో, ఎవరిని పరామర్శించాలో తెలియక చిరంజీవి అయోమయంలో పడ్డారు. నాయకులు ఓ వైపు వెళ్దామని చెబుతుండగా, పోలీసులు మరో వైపు రావాల్సిందిగా కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+