మహబూబ్‌నగర్: అడ్డాకుల మండలం కొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో ఒక వ్యక్తి మృతదేహం అనుమానాస్పద స్థితిలో పడి ఉంది. ఏడో నెంబరు జాతీయ రహదారి పక్కన ఆపి ఉంచిన ఇన్నోవా కారులో ఈ మృత దేహం ఉంది. మృతుడు ప్రముఖ మతప్రబోధకుడు కెఎ పాల్ సోదరుడు డేవిడ్ రాజుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అతని జేబులో డేవిడ్ రాజు అనే పేరుతో ఒక స్లిప్ ఉంది. దాని ఆధారంగా మృతుడిని డేవిడ్ రాజుగా భావిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో ఎవరనేది తేలుతుంది.
అన్నదమ్ముల మధ్య చాలా కాలంగా ఆస్ధి వివాదాలు ఉన్నాయి. గత సాధారణ ఎన్నికల్లో కెఎ పాల్ సొంత పార్టీపై పోటీ చేసి ఒక్క స్ధానం కూడా దక్కించుకోని విషయం తెలిసిందే.