సూర్యాపేట: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కారుపై దామోదర రెడ్డి వర్గీయులు దాడి చేశారు. ఖమ్మం జిల్లాలో జరిగే నంది ఉత్సవాలలో పాల్గొనేందుకు వెళతున్న మంత్రి సూర్యాపేటలో ఆగారు. మునిసిపల్ చైర్మన్ నీలం సత్యనారాయణ పుట్టిన రోజైనందున, శుభాకాంక్షలు చెప్పడానికి ఆయన వద్దకు వెళ్లారు. ఆ సమయంలో దామోదర రెడ్డి వర్గీయులు అతనిని అడ్డుకున్నారు. తమ ఎమ్మెల్యే లేని సమయంలో ఎందుకు వచ్చావని మంత్రిని ప్రశ్నించారు. అతని కారుపై రాళ్లు రువ్వారు. కారు అద్దాలు పగిలాయి. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదట తెలంగాణపై వీరంగం వేసినా తర్వాత అనేక కారణాల వల్ల వెనక్కి తగ్గారు. దామోదరరెడ్డి పక్కా తెలంగాణ వాదిగా మారారు. దానితో జిల్లాలో ఈ విభేదాలు తలెత్తాయి.