తిరుమల: శ్రీవారి లడ్డూ ఉత్పత్తిని పెంచేందుకు ఏర్పాటు చేసిన బూందీపోటును ముఖ్యమంత్రి రోశయ్య ప్రారంభించారు. అనంతరం తిరుమలలో వివాహం చేసుకునే జంటల కోసం నూతనంగా నిర్మించనున్న కల్యాణవేదికకు శంకుస్థాపన చేశారు.
తిరుమల లడ్డూలకు గిరాకీ పెరగడం అందరికీ తెలిసిందే. లడ్డూలను వైష్ణవ బ్రాహ్మణులే తయారు చేయాలన్న నిబంధన వల్ల లడ్డూల ఉత్పత్తి భక్తుల రద్దీకి తగినట్టుగా లేదు.