వైష్ణవి హత్య విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు: సిఎం

Rosaiah
హైదరాబాద్: బిసి నేత పలగాని ప్రభాకర్ కూతురు నాగ వైష్ణవి కిడ్నాప్, హత్య కేసు విచారణకు అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కె. రోశయ్య చెప్పారు. విచారణ వీలైనంత త్వరగా ముగిసే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. శాంతిభద్రతల పరిస్థితిపై ఉన్నత స్థాయి సమీక్ష అనంతరం ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రభాకర్ బంధువులే వైష్ణవి అపహరణకు, హత్యకు పూనుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఆయన చెప్పారు.

గత నెల 23 నుంచి ఇప్పటి వరకు విషాదకరమైన వార్తలే వింటున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో కల్తీ మద్యం సేవించి మరణించిన వారి సంఖ్య 17కు చేరిందని, కొంత మంది ఇంకా అస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించి ఆబ్కారీ ప్రొహిబిషన్ అధికారులపై చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. వరస పడవ ప్రమాదాలు కూడా సంభవించాయని ఆయన అన్నారు. విశాఖ పట్నం జిల్లాలో జరిగిన పడవ ప్రమాదాలపై మెజీస్టిరియల్ విచారణకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+