విజయవాడ: హత్యకు గురైన నాగ వైష్ణవి తండ్రి, బిసి నేత పలగాని ప్రభాకర్ మరణించారు. నాగవైష్ణవి హత్యకు గురైందనే విషయం తెలిసిన వెంటనే ప్రభాకర్ కు గుండెపోటు వచ్చింది. రెండు సార్లు అతనికి గుండెపోటు వచ్చింది. దాంతో అతన్ని ఆస్పత్రిలో చేర్చారు. మంగళవారం ఉదయం అతను మరణించాడు.
మంగళవారం ఉదయం ప్రభాకర్ కోమాలోకి వెళ్లిపోయారు. అతన్ని వెంటిలేటర్ మీద ఉంచి కృత్రిమ శ్వాస అందించారు. కానీ ఫలితం లేకపోయింది. వైష్ణవి తల్లి కూడా మాట్లాడలేని స్థితిలో ఉంది. కుటుంబ కలహాల వల్లనే నాగవైష్ణవి హత్యకు గురైంది.