గుంటూరు: దారుణ హత్యకు గురైన నాగవైష్ణవికి మృతదేహానికి వైద్యులు మంగళవారం పంచనామా పూర్తి చేశారు. రాజకుమార్ నేతృత్వంలోని వైద్య బృందం ఆమె మృతదేహానికి గుంటూరు ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిపారు. వైష్ణవి మృతదేహం పూర్తిగా కాలి బూడిదైంది. రెండు అస్థికలు మాత్రమే లభించాయి. ఆ అస్థికలను సేకరించి భద్రపరిచారు. వాటిని హైదరాబాదులోని ఫోరెన్సిక్ లాబొరేటరీకి పరీక్ష నిమిత్తం పంపుతున్నారు.
నాగవైష్ణవి మృతదేహాం పూర్తిగా కాలి బూడిదైందని రాజకుమార్ చెప్పారు. నాగవైష్ణవి హత్యను జీర్ణించుకోలేని ఆమె తండ్రి పలగాని ప్రభాకర్ గుండెపోటుతో మరణించారు. దీంతో రాజకీయ నాయకులు యావత్తు ఆయన మృతికి సంతాపం ప్రటించారు. పలగాని ప్రభాకర్ మృతికి ముఖ్యమంత్రి రోశయ్య, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు. రాజకీయ నాయకులు ఒక్కరొక్కరే విజయవాడకు చేరుకుంటున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి