తెలంగాణపై రెండు, మూడు రోజుల్లో కమిటీ

కాగా, చిదంబరంతో కాంగ్రెసు కోస్తాంధ్ర సీనియర్ నాయకుడు ఎన్ జనార్దన్ రెడ్డి కలుసుకున్నారు. ఆయన కూడా కేంద్ర ప్రభుత్వం వేయబోయే కమిటీ గురించే చిదంబరంతో మాట్లాడినట్లు తెలుస్తోంది. కమిటీ విచారణాంశాలు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. కమిటీ విధివిధానాలపై ప్రణబ్ ముఖర్జీతో కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ, కేంద్ర న్యాయశాఖ వీరప్ప మొయిలీ మంగళవారం చర్చలు జరిపారు. వీరిద్దరు కలిసి విధివిధానాలను ఖరారు చేసినట్లు సమాచారం. లాబీయింగ్ ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవాలని సీమాంధ్ర నాయకులు నిర్ణయించుకున్నారు. రాయలసీమ కాంగ్రెసు శాసనసభ్యుడు టీజీ వెంకటేష్ మంగళవారం ఇదే విషయాన్ని చెప్పారు. రాష్ట్ర విభజన జరగాల్సి వస్తే షరతులతో కూడి ఉండాలని ఆయన అన్నారు. రాయలసీమకు ఇప్పటికే చాలా అన్యాయం జరిగిందని, విభజన జరిగితే మరింత అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications