హైదరాబాద్: రాష్ట్ర పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసినందుకు తెలంగాణ రాజకీయ జెఎసిలో ప్రధాన పాత్ర పోషిస్తున్న కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు కె. జానా రెడ్డి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. కమిటీ నిర్దిష్ట కాలపరిమితితో చర్చలు పూర్తి చేసి తెలంగాణ రాష్టాన్ని ఏర్పాటు చేయడానికి మార్గం వేస్తుందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రయత్నం సాగిస్తున్నందుకు ఆయన సోనియాకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ ఏర్పాటు సాకారమవుతుందని ఆయన అన్నారు.
కమిటీపై అపోహలు కలిగించే విధంగా ప్రకటనలు చేయవద్దని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ సూచించారు. తెలంగాణది దెబ్బ తిన్న ప్రాణమని, కమిటీపై అనుమానాలు ఉండడం సహజమని కాంగ్రెసు సీనియర్ నేత టి. జీవన్ రెడ్డి అన్నారు. కమిటీకి నిర్దిష్ట కాలపరిమితి, విధివిధానాలు ఖరారు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కమిటీ ముందు రాజకీయ పార్టీలు తెలంగాణ ప్రజల అభిప్రాయాలు చెప్పాలని ఆయన కోరారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి