వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేడారంలో మినీ జాతరగా తిరుగువారం

By Santaram
|
Google Oneindia TeluguNews

Medaram Jatara
ఏటూరునాగారం: తిరుగువారం పండగతో మేడారంలో మళ్లీ సందడి నెలకొంది. జాతర సందర్భంగా తెలిసీ తెలియక చేసిన తప్పులను క్షమించాలని వేడుకుంటూ పూజారులు గిరిజన సంప్రదాయం ప్రకారం పండగ నిర్వహించారు. భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మలకు మొక్కులు సమర్పించుకున్నారు. మేడారం జాతర అనంతరం తిరుగువారం పండగ జరుపుకోవడం ఆనవాయితీ. గత నెల 27 నుంచి 30 వరకు సమ్మక్క-సారలమ్మ జాతర వైభవంగా జరిగిన విషయం విదితమే. తిరుగువారం పండగను గిరిజనులు అత్యంత భక్తిశ్రద్ధలతో బుధవారం జరుపుకున్నారు. మేడారంలోని సమ్మక్క-సారలమ్మ, కొండాయిలోని గోవిందరాజు, పూనుగొండ్ల కామారంలోని పగిడిద్దరాజు వద్ద గిరిజనులు తిరుగువారం పండగను ఘనంగా నిర్వహించారు.

మేడారంలో సమ్మక్క తిరుగువారం పండగ మినీ జాతరను తలపించింది. సమ్మక్క-సారలమ్మల వనప్రవేశం జరిగిన నాలుగు రోజులకు మేడారంలో గిరిజనులు సమ్మక్క తిరుగువారం పండగను పూజారులు కొక్కెర సాంబశివరావు, కాక సారయ్య ఆధ్వర్యంలో వైభవంగా జరుపుకున్నారు. దీంతో మేడారం జాతర పూర్తయినట్లు గిరిజనులు భావిస్తారు. ఈ సందర్భంగా మేడారంలోని సమ్మక్క ఆలయం, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. తిరుగువారం పండగ జరుగుతుందనే విషయం తెలుసుకున్న భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో గద్దెల ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో సందడి కనిపించింది. సుమారు 40వేల మంది భక్తులు వనదేవతలను దర్శించుకొని మొక్కులు సమర్పించుకున్నారు. తొలుత గిరిజన పెద్దలు, పూజారులు సమ్మక్క, సారలమ్మ ఆలయాలను నీటితో శుభ్రం చేసి ఆలయం చుట్టూ రంగురంగుల ముగ్గులు వేశారు.

ఉదయం 10 గంటలకు డోలువాయిద్యాలతో సమ్మక్క, సారలమ్మ ఆలయాలకు పూజారులు చేరుకుని వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. గుడి ఇప్పడం, మెలగడం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సమ్మక్క గుడిలో సాయంత్రం వరకు పూజలు నిర్వహించిన అనంతరం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో పూజారులు, గిరిజన పెద్దలు వస్త్రాలు, పూజా సామగ్రి తీసుకుని చిలకలగుట్టకు చేరుకున్నారు. దేవతకు నిర్వహించే కార్యక్రమాలను ఎవరి కంట పడకుండా పూజారులు రహస్యంగా జరపడం ఇక్కడి ప్రత్యేకత. రెండేళ్లకోమారు జరిగే జాత ర వరకు మమ్మల్ని సల్లంగా సూడు తల్లీ అని వేడుకున్నారు. ప్రతీ బుధవారం నీ పండగకు పూజలు చేస్తామని గిరిజన పెద్దలు, పూజారులు దేవతను వేడుకొని మేడారానికి తిరిగొస్తారని గిరిజన పెద్దలు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X