వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఏమైనా ఉంటే నాతో తేల్చుకోవాలి: షారుఖ్ ఖాన్

సినిమా ఒక సాధారణమైన సంఘటన మాత్రమేనని, సినిమా ప్రదర్శనను అడ్డుకుంటారని తాను అనుకోవడం లేదని, అది విడుదల అవుతుందని, ప్రజలు దాన్ని ఇష్టపడతారని ఆయన అన్నారు. తన అభిప్రాయాలకు మై నేమ్ ఈజ్ ఖాన్ సినిమాకు సంబంధం ఏమిటో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. ఆ సినిమా తన ఒక్కడిదే కాదని, కాజోల్, కరన్ లతో పాటు వందా యాభై మంది ఈ సినిమా కోసం పనిచేశారని, వారికి జీననాధారం కల్పించిందని ఆయన అన్నారు. మనం భారతీయులమని, మనం సంతోషంగా, ఆనందంగా జీవిచాలని, తాము మంచిగా ఉండాలని మాత్రమే తన మాటల ఆంతర్యమని ఆయన అన్నారు.