తొవ్వలపై తెలంగాణ వంటా వార్పూ

తెలంగాణ ప్రజల సంఘటిత శక్తిని చాటడానికే ఈ కార్యక్రమం చేపట్టినట్లు కోదండరామ్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు తెలంగాణ ప్రజలు సంఘటితంగా పోరాటం చేస్తారని తెలియజేయడానికి వంటా వార్పూ కార్యక్రమం చేపట్టామని ఆయన అన్నారు. తెలంగాణ సాధించే వరకు ప్రజలు సంఘటితంగా ముందుకు సాగుతారని ఆయన అన్నారు. తెలంగాణకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు. వంటావార్పూ కార్యక్రమంలో భాగంగా మహిళలు రోడ్లపై బతుకమ్మ ఆడారు. ప్రజలు కళాప్రదర్శనలు ఇచ్చారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ఈ వంటా వార్పూ కార్యక్రమం నడిచింది.












Click it and Unblock the Notifications