వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అల్లు అర్జున్ షూటింగ్ కు తెలంగాణ దెబ్బ

By Pratap
|
Google Oneindia TeluguNews

Allu Arjun
హైదరాబాద్: హీరో అల్లు అర్జున్ నటిస్తున్న వరుడు సినిమా షూటింగ్ తెలంగాణ ఆందోళనకారులు శుక్రవారం అడ్డుకున్నారు. హైరాబాదు సమీపంలోని మూసాపేట ట్రావెల్ రోడ్డులో షూటింగ్ జరుగుతుందని తెలుసుకున్న తెలంగాణవాదులు అక్కడికి చేరుకుని షూటింగ్ ను అడ్డుకున్నారు. సినిమా షూటింగ్ జరగడానికి వీలు లేదంటూ అడ్డుపడ్డారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనకారులను అక్కడి నుంచి తరిమి కొట్టారు. దాంతో సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది.

ఇటీవల రోజా నటిస్తున్న గోలీమార్ చిత్రం షూటింగును, సునీల్ నటిస్తున్న మర్యాద రామన్న షూటింగును తెలంగాణ ఆందోళనకారులు అడ్డుకున్నారు. అంతకు ముందు ఓసారి అల్లు అర్జున్ వరుడు చిత్రం షూటింగ్ ను కూడా అడ్డుకున్నారు. మహేష్, విష్ణుల చిత్రాల షూటింగులను కూడా అడ్డుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X