ఎన్టీఆర్ అదుర్స్: నాని వర్సెస్ హరీష్

మీడియా తన మాటలను వక్రీకరించిందని కొడాలి నాని అన్నారు. తాను తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీయలేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో అదుర్స్ ఓపెనింగ్స్ దెబ్బ తినడం వల్ల కోటి రూపాయలు నష్టపోయామని ఆయన చెప్పారు. హైదరాబాదులో తిరగనివ్వమనడానికి హరీష్ రావు ఎవరని ఆయన అడిగారు. ఎన్టీఆర్ పై అభిమానంతోనే అదుర్స్ సినిమాను అడ్డుకోలేదని, నాని మాట్లాడిన తీరు బాగా లేదని శాసనసభ్యురాలు సీతక్క అన్నారు. కాగా, వరంగల్ లో అశోక్ థియేటర్ లో బిందాస్ సినిమా ప్రదర్శనను తెలంగాణవాదులు అడ్డుకున్నారు.












Click it and Unblock the Notifications