ఏమైనా ఉంటే సోనియాకు చెప్పాలి: డిఎస్

ముస్లిం రిజర్వేషన్లపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన చెప్పారు. పార్టీపరంగా, ప్రభుత్వ పరంగా అధ్యయనం చేసిన తర్వాత హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ఆయన చెప్పారు. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో న్యాయపరంగా చేయాల్సిందంతా ప్రభుత్వం చేస్తుందని ఆయన చెప్పారు. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు లేవనెత్తిన అంశాలను పరిశీలించి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తుందని ఆయన చెప్పారు. ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెసు చిత్తశుద్ధిని ప్రశ్నించే హక్కు తెలుగుదేశం పార్టీకి లేదని ఆయన అన్నారు. ముస్లింల సంక్షేమాన్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పట్టించుకోలేదని ఆయన అన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఇచ్చిన హామీని ప్రస్తావిస్తూ అది ఎలా సాధ్యమని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications