తెలంగాణ అంతటా అదుర్స్ షోలకు బ్రేక్

వరంగల్ లోని థియేటర్లలో అదుర్స్ సినిమాతో పాటు మోహన్ బాబు కుమారుడు నటించిన బిందాస్ సినిమా ప్రదర్సనకు కూడా బ్రేకులు పడ్డాయి. వరంగల్ జిల్లాలోని జనగామలో కూడా అదుర్స్ సినిమా ప్రదర్శన ఆగిపోయింది. కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్, కరీంనగర్, గోదావరిఖని, వేములవాడ తదితర ప్రాంతాల్లో ఎనిమిది చోట్ల అదుర్స్ సినిమా ప్రదర్శన ఆగిపోయింది. మహబూబ్ నగర్ జిల్లాలోని ఆమనగల్ లో తెలంగాణవాదులు అదుర్స్ సినిమా రీళ్లను దగ్ధం చేశారు. షాద్ నగర్ లో కూడా అదుర్స్ సినిమా ప్రదర్శన ఆగిపోయింది. నాగర్ కర్నూలులో జూనియర్ ఎన్టీఆర్ కటౌట్లను దగ్ధం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనూ కామారెడ్డి తదితర ప్రాంతాల్లోనూ అదుర్స్ సినిమా ప్రదర్శన ఆగిపోయింది. నల్లగొండ జిల్లాలోని హాలియాలో అదుర్స్ సినిమా ఆగిపోయింది.












Click it and Unblock the Notifications