వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నానిపై నిర్మాతల మండలి అసంతృప్తి

By Pratap
|
Google Oneindia TeluguNews

Jr Ntr
హైదరాబాద్: తెలుగుదేశం శాసనసభ్యుడు, అదుర్స్ సినిమా నిర్మాత కొడాలి నాని వ్యాఖ్యలపై తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజకీయాలకు, సినిమాలకు ముడిపెట్టవద్దని విజ్ఞప్తి చేసింది. అదుర్స్ సినిమా విడుదల సమయంలో నెలకొన్న ఉద్వేగభరిత వాతావరణాన్ని చల్లార్చి ఆ సినిమా విడుదలకు తామెంతో కృషి చేశామని, సినిమాల ప్రదర్సనకు తెలంగాణలో అనుకూలమైన వాతావరణం ఏర్పడిన ప్రస్తుత తరుణంలో నాని వ్యాఖ్యలు నష్టం చేసేవిగా ఉన్నాయని నిర్మాతల మండలి భావిస్తున్నట్లు సమాచారం. నాని వ్యాఖ్యల వల్ల మరోసారి తెలుగు సినిమా ప్రదర్శనలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

కాగా, అదుర్స్ సినిమా ప్రదర్శనను అడ్డుకోవాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం జెఎసి పిలుపునిచ్చింది. హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకుని, పోలీసు రక్షణలో అదుర్స్ సినిమాను ప్రదర్శింపజేసుకున్నారని, హైకోర్టు ఆదేశాలను గౌరవించి తాము సినిమా ప్రదర్శనను ఆహ్వానించామని, దాన్ని కొడాలి నాని తమ బలహీనతగా తీసుకుంటున్నారని విద్యార్థి జెఎసి నాయకులు అంటున్నారు. కొడాలి నాని అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని, తెలంగాణ ఉద్యమం నడుస్తున్న కాలంలోనే సమైక్యవాదుల ఆధిపత్య ధోరణి ఈ విధంగా ఉంటే మామూలు స్థితిలో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చునని వారంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X