శ్రీనగర్: జమ్మా కాశ్మీర్ లో మంచు తుఫానుకు 17 మంది సైనికులు సజీవ సమాధి అయ్యారు. మరో 17 మంది గాయపడ్డారు. సజీవ సమాధి అయిన సైనికుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి కూడా ఉన్నాడు. తొమ్మిదేళ్లుగా సైన్యంలో పని చేస్తున్న శివనాగేశ్వర రావు అనే 28 ఏళ్ల ఆంధ్ర సైనికుడు మరణించాడు. ఆయన గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం పెద గొల్లెపాలెం గ్రామానికి చెందినవాడు. తొమ్మిదేళ్ల క్రితం అతను సైన్యంలో చేరాడు. ప్రస్తుతం ఆయన నాయక్ హోదాలో పని చేస్తున్నారు.
బాపట్లకు చెందిన అనూషతో ఆయనకు రెండున్నరేళ్ల క్రితం వివాహమైంది. ఆదివారం రాత్రి శివనాగేశ్వరరావు ఫోనులో భార్యతో మాట్లాడాడు. శివనాగేశ్వర రావు మృతి చెందిన సమాచారం ఆయన మామ గవిని హరిప్రసాదరావుకు సైన్యాధికారుల నుంచి అందింది. శివనాగేశ్వర రావు తండ్రి వెంకటేశ్వర్లు రైతు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి