తెలంగాణ కమిటీపై నేడు కోర్ కమిటీ భేటీ

నిజానికి, కాంగ్రెసు కోర్ కమిటీ సోమవారంనాడే భేటీ కావాల్సింది. కానీ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ అందుబాటులో లేకపోవడంతో భేటీ వాయిదా పడింది. ఆయన కోల్ కత్తాలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. కమిటీ విధివిధానాలు ఆంధ్రప్రదేశ్ లోని ఇరు ప్రాంతాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా పదజాలం కూర్పును ప్రణబ్ ముఖర్జీయే సూచించారు. అందుకు అనుగుణంగా ఉందా, లేదా చూడడానికి ప్రణబ్ ముఖర్జీ అందుబాటులో ఉండడం అవసరంగా మారింది. దీంతో సోమవారంనాటి కోర్ కమిటీ భేటీని వాయిదా వేసుకున్నారు.












Click it and Unblock the Notifications