TTD మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం - అరుదైన అవకాశం..!!

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొంత మేర తగ్గింది. వేసవి సెలవులు పూర్తి కావటం.. విద్యా సంస్థలు రీ ఓపెన్ కావటంతో రద్దీ కొంత తగ్గింది. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు చేపడుతోంది. సాధారణ భక్తులకు దర్శనంలో ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటోంది. క్యూ లైన్ మేనేజ్ మెంట్ విధానం తో ఎక్కువ మందికి దర్శనం అయ్యేలా నిర్ణయాలు అమలు చేస్తోంది. కాగా, టీటీడీ మరో వినూత్న కార్యక్రమం అమలుకు సిద్దం అయింది. ఇందుకు రేపు ముహూర్తంగా నిర్ణయించింది.

ఓ వినూత్న కార్యక్రమానికి టీటీడీ త్వరలో శ్రీకారం చుట్టబోతోంది. నూతనంగా అక్షర గోవిందం కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. దీని కింద చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం చేయిస్తుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ వకుళామాత ఆశీస్సులతో అక్షరాభ్యాసానికి చేపట్టనుంది. జూలై 3వ తేదీ మధ్యాహ్నం 12.00 నుండి 12.30 గంటల వరకు వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆశీస్సులతో, శ్రీ వకుళామాత సన్నిధిలో చిన్నారులకు సంప్రదాయబద్ధంగా అక్షరాభ్యాసం నిర్వహిస్తారు. టిటిడి ఆధ్వర్యంలో జూలై 3న శ్రీ వకుళామాత సన్నిధిలో నిర్వహించనున్న "అక్షర గోవిందం - అన్నప్రాశన" కార్యక్రమానికి పటిష్ట ఏర్పాట్లు చేపడుతున్నట్లు టిటిడి జేఈవో డా శరత్ తెలిపారు. ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.

నరసాపురం-అరుణాచలం వీక్లీ ఇక రెగ్యులర్:షెడ్యూల్ ఇలా..!!
నరసాపురం-అరుణాచలం వీక్లీ ఇక రెగ్యులర్:షెడ్యూల్ ఇలా..!!
ttd-is-all-set-to-launch-akshara-govindam-annaprasana-at-the-sri-vakulamatha-temple-on-july-3

వకుళామాత ఆలయంలో నిర్వహణ

శ్రీవేంకటేశ్వరస్వామి అనుగ్రహంతో, శ్రీ వకుళామాత కరుణాకటాక్షాల మధ్య వేదోక్తంగా చిన్నారుల కు అక్షరాభ్యాసం, అన్నప్రాశన నిర్వహించనున్నట్లు జేఈవో తెలిపారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ సంప్రదాయబద్ధంగా జరిగే ఈ పవిత్ర కార్యక్రమంలో తొలి రోజు నమోదు చేసుకున్న 25 మంది చిన్నారులు తమ తల్లిదండ్రులతో నిర్ణీత సమయానికి హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని, పాల్గొనదలచిన వారు ముందస్తుగా నమోదు చేసుకోవాలని సూచించారు. అక్షర గోవిందంలో పాల్గొనే ప్రతి చిన్నారికి ఉచితంగా "అక్షర గోవిందం" కిట్ అందజేయనున్నట్లు వెల్లడించారు. జూలై 4 నుండి ఆలయ అర్చకుల పర్యవేక్షణలో ప్రతిరోజూ రెండు బ్యాచ్‌లలో, ఒక్కో బ్యాచ్‌కు 25 మంది చొప్పున అక్షరాభ్యాసం, అన్నప్రాశన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+