రాజగోపాల్ రెడ్డి కీలక నిర్ణయం..!?
అధికార పార్టీలో రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ కీలకంగా మారుతోంది. కొంత కాలంగా రాజగోపాల్ రెడ్డి పార్టీ రాష్ట్ర నాయకత్వం పైన అసంతృప్తి తో ఉన్నారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరే సమయం లో మంత్రి పదవి పైన హామీ ఇచ్చారని.. తనకు మంత్రిగా ఎందుకు అవకాశం ఇవ్వరని పలు సందర్భాల్లో ప్రశ్నించారు. ఇక, ఇప్పుడు యాదగిరి గుట్ట ఆలయ బోర్డు నియామకం విషయంలో నూ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇప్పుడు ఆయన కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారనే ప్రచారం కీలకంగా మారుతోంది.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తీవ్ర అసంతృప్తి తో కనిపిస్తున్నారు. తాజాగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. కాంగ్రెస్ లో చేరే సమయం లో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి పైన హామీ దక్కింది. అయితే, సోదరుడు కోమటిరెడ్డి వెంకట రెడ్డి మంత్రిగా ఉన్నారు. దీంతో, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి సాధ్యం కాదని.. ఇద్దరిలో ఒకరికే అవకాశం ఉంటుందని పార్టీ చెబుతూ వచ్చింది. వరుసగా రెండు సార్లు మంత్రివర్గంలో చేర్పులు జరిగినా తనకు అవకాశం ఇవ్వకపోవటం పైన ఆగ్రహంతో ఉన్నారు. పలు సందర్భాల్లో సీఎం రేవంత్ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసారు. కాగా.. ఇప్పుడు ముఖ్యమంత్రి నల్గొండ పర్యటన సమయంలో దూరంగా ఉన్నారు. దీని పైన స్పందించిన ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయం గా సంచలనంగా మారాయి.

యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్ బోర్డు, నూతన కార్యవర్గ ఏర్పాటుపై తనను సంప్రదించకపోవడం బాధాకరమని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. మునుగోడు నియోజకవర్గం యాదాద్రి జిల్లాలోనే ఉన్నప్పటికీ తనకు కనీస సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ వ్యవహారశైలి అస్సలు బాగోలేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఆయనకు షోఆప్స్ ఎక్కువ అయ్యాయని అన్నారు. తాను మునుగోడు ఎమ్మెల్యేను.. యాదాద్రి జిల్లాలోనే తన మునుగోడు నియోజకవర్గం ఉంటుందని.. అలాంటప్పుడు యాదగిరిగట్టు ధర్మకర్తల మండలి ఏర్పాటు చేసినప్పుడు తనకు కనీస సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది వన్‌సైడ్ నిర్ణయమతని.. ఇది కరెక్ట్ కాదని అన్నారు. తనను సంప్రదించి ఉంటే.. నియోజకవర్గం నుంచి ఒక మెంబర్‌ను అయినా మండలిలో చేర్పించుకునేవాడిని అని తెలిపారు. ఇది చాలా దారుణమని అన్నారు. కాంగ్రెస్‌లోకి ఎక్కడెక్కడి నుంచో కొత్తవాళ్లు వచ్చారని తెలిపారు. అంతా వాళ్లదే నడుస్తుందని అన్నారు. ఒరిజినల్‌గా తెలంగాణ కోసం కొట్లాడినవాళ్లు అందరూ రోజురోజుకీ కనుమరగవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. రాజగోపాల్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని పార్టీలో ప్రచారం సాగుతోంది. దీంతో, ఆయన తీసుకునే నిర్ణయం ఏంటనే ఆసక్తి రాజకీయంగా మొదలైంది.












Click it and Unblock the Notifications