"నాగబంధం" మూవీ ఫస్ట్ రివ్యూ: టాక్ ఏంటి భయ్యా ఇలా ఉంది..!

ఇటీవలి కాలంలో సినిమాలు చూసే విధానం మారిపోయింది. అప్పట్లో పెద్ద హీరోల సినిమాలకు జనాలు క్యూ కట్టేవారు. సినిమా ఎలా ఉన్నా ఓసారి తమ అభిమాన హీరోను స్క్రీన్ పై చూడాలి అని కోరుకునేవారు. కానీ ఈ మధ్య కంటెంట్ ఉన్న సినిమాలదే హవా నడుస్తోంది. సినిమాలో అసలు హీరో ఉన్నాడా..? లేక స్టోరీనే హీరోనా..? ఇవేమీ పట్టించుకోకుండా వెళ్తున్నారు. ఇటీవలికాలంలో చాలా చిన్న సినిమాలు హీరోతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. కంటెంట్ ఈజ్ కింగ్ అని నిరూపించాయి. అయితే ఇటీవల టీజర్, ట్రైలర్ తో అందరి దృష్టిని ఆకర్షించిన సినిమా "నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్" .. ఈ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. ఈ మూవీలో యువ హీరో విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్, దక్షా నగార్కర్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ ప్రముఖ నటుడు మహేశ్ మంజ్రేకర్, టాలీవుడ్ ప్రముఖ నటుడు జగపతి బాబు, మురళీ శర్మ, కేజీఎఫ్ ఫేమ్ రామచంద్రరాజు, అనసూయ భరద్వాజ్, శరణ్య తదితర నటులు ఈ మూవీలో కీలక పాత్ర పోషించారు. ఈ మూవీని రూ. 100 కోట్ల బడ్జెట్ తో అత్యద్భుతంగా తెరకెక్కించారు. హిమాలయ పర్వతాల్లోని పురాతన విష్ణు దేవాలయాలు, అనంత పద్మనాభస్వామి ఆలయం, అలాగే దేశంలోని ఇతర చారిత్రాత్మక టెంపుల్స్ ను కాపాడే నాగదేవతల కథాంశంతో ఈ సినిమా సాగుతుంది.

Nagabandham First Review Out Film Called Outstanding in Content and Visuals Nagabandham movie

పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూలై 3 న విడుదల కానుంది. అయితే తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. మూవీ రన్ టైమ్ మూడు గంటల 5 నిమిషాలుగా ఉంది. సెన్సార్ సభ్యులు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ప్రకారం.. ఈ మూవీ కంటెంట్ పరంగా, విజువల్స్ పరంగా అద్దిరిపోయిందని టాక్. విరాట్ కర్ణ, నభా నటేష్ ల నటన అద్భుతంగా ఉందని.. భారీ గ్రాఫిక్స్ , అబ్బుర పరిచే విజువల్ ఎఫెక్ట్స్, గ్రాండ్ స్కేల్ లో పాటలు ఇలా ప్రతీ విషయం థియేటర్లలో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఈ మూవీ బ్లాక్ బస్టర్ అంటూ రిపోర్ట్ వస్తోంది. దాంతో ఈ మూవీని చూసేందుకు ప్రేక్షకులు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే బుక్ మై షోలో బుకింగ్స్ స్పీడ్ గా సాగుతున్నాయి. ఇక ఫుల్ రివ్యూ సినిమా రిలీజ్ అయిన తర్వాతే తెలుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+