ఎమ్మెల్యేలది తొందరపాటు చర్య: కె కేశవరావు

Kesava Rao
హైదరాబాద్: శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు తెలంగాణకు అనుకూలంగా లేకపోతే శాసనసభ సమావేశాలను బహిష్కరిస్తామని తమ పార్టీ తెలంగాణ శాసనసభ్యులు అనడం తొందరపాటు చర్య అని కాంగ్రెసు సీనియర్ నాయకుడు కె. కేశవ రావు అన్నారు. తెలంగాణ నాయకుల మనోభావాలను తాను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుని పోతానని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాబోమని తెలంగాణ కాంగ్రెసు శాసనసభ్యులు అనడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం చిత్తశుద్ధితో ఉందని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు తెలంగాణకు అనుకూలంగానే ఉండవచ్చునని ఆయన అన్నారు.

కమిటీ విధివిధానాల్లో ఏమైనా తేడా వస్తే పార్టీ అధిష్టానంతో మాట్లాడుకోవచ్చునని ఆయన అన్నారు. తెలంగాణపై సమాచారం ఇవ్వడానికే శ్రీకృష్ణ కమిటీని కేంద్ర ప్రభుత్వం వేసిందని ఆయన అన్నారు. కేంద్ర హోం మంత్రి చిదంబరం డిసెంబర్ 9వ తేదీన చేసిన ప్రకటనకు అనుగుణంగానే కమిటీ విధివిధానాలుంటాయని ఆయన చెప్పారు.తెలంగాణ రావాలనే ఆతురుతలో కొందరు ఆవేశపడుతున్నారని ఆయన అన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు తెలంగాణ ఉద్యమం ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. తెలంగాణపై పార్లమెంటుదే అంతిమ నిర్ణయమని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+