తెలంగాణపై త్వరగా స్పందించాలి: సురేష్ రెడ్డి

KR Suresh Reddy
హైదరాబాద్: తెలంగాణపై వేసిన కమిటీ విధివిధానాల విషయంలో కేంద్ర ప్రభుత్వం త్వరగా స్పందించాలని కాంగ్రెసు నాయకుడు, శాసనసభ మాజీ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి అన్నారు. నాయకులు ఒకసారి ఓడిపోతే మరోసారి గెలవడానికి వీలుంటుందని, విద్యార్థులు విద్యాసంవత్సరం కోల్పోతే మరోసారి రాదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కాంగ్రెసు పెద్దలు విద్యార్థులతో మాట్లాడాలని, విద్యార్థులకు విశ్వాసం కల్పించాలని, వారిని విశ్వాలంలోకి తీసుకోవాలని ఆయన అన్నారు.

తమ పార్టీ తెలంగాణ శాసనసభ్యులు శాసనసభ సమావేశాలను బహిష్కరిస్తామని అనడం సరి కాదని కాగ్రెసు తెలంగాణ సీనియర్ శాసనసభ్యుడు పి. శంకర రావు అన్నారు. శాసనసభ సమావేశాలకు హాజరై తెలంగాణ అంశాన్ని ప్రస్తావించాలని ఆయన అన్నారు. ఈ నెల 14వ తేదీ లోపల కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు ప్రకటించాలని ఆయన కోరారు. కమిటీ విధివిధానాలు తెలంగాణకు అనుకూలంగా లేకపోతే శాసనసభ ఏమిటి, ప్రభుత్వాన్నే స్తంభింపజేస్తామని ప్రజలు అంటున్నారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+