వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకు కెవిపి బహిరంగ లేఖ

|
Google Oneindia TeluguNews

KVP Ramchandar Rao
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై తెలుగుదేశం పార్టీ నాయకులు అవినీతి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆయన చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఐదు పేజీల లేఖ రాశారు. తనపై చంద్రబాబు తమ పార్టీ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గాలి ముద్దుకృష్ణమ నాయుడు తదితర నాయకులతో అవినీతి ఆరోపణలు చేయిస్తున్నారని ఆయన అన్నారు. దివంగత నేత వైయస్ ఆకస్మిక మరణం తర్వాత చంద్రబాబు దృష్టి తనపై పడిందని ఆయన అన్నారు. తనను అపఖ్యాతి పాలు చేయడం చంద్రబాబు తక్షణావసరంగా భావిస్తున్నారని ఆయన అన్నారు. అధికారం కోసం ఏ గడ్డి కరవడమైనా తప్పు లేదని చంద్రబాబు మనసావాచాకర్మణా నమ్మినవారని ఆయన అన్నారు.

తాను చంద్రబాబు ఒకసారే 1978లో హైదరాబాద్ వచ్చామని, అప్పుడు చంద్రబాబు ఆస్తులేమిటో తన ఆస్తులేమిటో తెలుసుకోవాలని ఆయన అన్నారు. తాను గుల్బర్గా వైద్య కశాశాలకు కట్టిన డొనేషన్ మొత్తం కన్నా చంద్రబాబు కుటుంబం ఆస్తి ఉండేదని, ఇప్పుడు ప్రపంచంలోని సంపన్నుల్లో ఒక్కరిగా చంద్రబాబు మారారని ఆయన అన్నారు. అధికారం కోసం ఎన్టీఆర్ ను చితక కొట్టినట్లుగా అందరినీ చితకగొట్టగలమని చంద్రబాబు అనుకుంటే అది తప్పు అని ఆయన అన్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను తన స్వార్థ రాజకీయాలకు చంద్రబాబు వాడుకున్నారని ఆయన ఆరోపించారు. పురంధేశ్వరిపై బాలకృష్ణను, సవతి తల్లి లక్ష్మీపార్వతిపై హరికృష్ణను ఉసిగొల్పిన చరిత్ర చంద్రబాబుదని ఆయన అన్నారు.

తనపై వచ్చిన ఆరోపణలపై తాను అగ్నిపరీక్షకైనా సిద్ధమని ఆయన చెప్పారు. దుబాయ్ లో తనపై, తన కుమారుడిపై కేసులున్నట్లు, తాము పారిపోయి వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని, అదే నిజమైతే తమ కుటుంబసభ్యులమంతా ఈ నెల 11వ తేదీ దుబాయ్ వెళ్తున్నామని, ఐదు రోజుల పాటు ఉంటామని, ఈలోగా చంద్రబాబు ఏమైనా చేయగలిగితే చేయాలని ఆయన అన్నారు. దుబాయ్ లో తనపై కేసు విచారణ జరిగితే జైలుకు వెళ్తానని, బెయిల్ కూడా తీసుకోనని, నిజంగా తాను అవినీతి పాల్పడినట్లు రుజువైతే అక్కడి నుంచి తిరిగి రానని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి జీవించి ఉన్నప్పుడు వైయస్ జగన్ పై చంద్రబాబు అసంబద్ధమైన ఆరోపణలు చేశారని, ఎంతగా గగ్గోలు పెట్టిన ప్రజలు నమ్మలేదని, చంద్రబాబుకు విశ్వసనీయత లేదని ఆయన అన్నారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ ను తాను లాగదలుచుకోలేదని, తమ పిల్లలను కూడా లాగే చంద్రబాబుకు జాతి నీతి లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X