వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏప్రిల్ 1న ప్రణీతతో ఎన్టీఆర్ నిశ్చితార్థం

By Pratap
|
Google Oneindia TeluguNews

Jr Ntr
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ నిశ్చితార్థం ఏప్రిల్ 1వ తేదీన జరగనున్నట్లు తెలుస్తోంది. నారా చంద్రబాబు నాయుడు బంధువు నార్నే శ్రీనివాస రావు కూతురు లక్ష్మీప్రణీతతో ఎన్టీఆర్ పెళ్లి ఖరారైన విషయం తెలిసిందే. వారిద్దరి పెళ్లికి ఏప్రిల్ 1వ తేదీన నిశ్చితార్థం పెట్టాలని పెద్దలు నిర్ణయించారు. ఆ రోజు చైత్ర బహుళ తదియ గురువారం కావడంతో మంచి రోజుగా భావించి అందుకు ముహూర్తం ఖారారు చేసినట్లు తెలుస్తోంది.

హైదరాబాదులోని ఓ పంక్షన్ హాల్లో ఈ నిశ్చితార్థం వేడుకలు జరుగుతాయని తెలుస్తోంది. దీనికి కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఏప్రిల్ 1వ తేదీకి ముందుగానే నిశ్చితార్థం పెట్టుకోవాలని అనుకున్నారు. అయితే మార్చి 28వ తేదీతో లక్ష్మీ ప్రణీతకు మైనారిటీ తీరుతుంది. దానివల్ల ఏప్రిల్ 1వ తేదీని నిశ్చితార్థానికి ముహూర్తంగా ఖరారు చేశారు.

కాగా, ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు. శక్తి సినిమా షూటింగు కోసం ఆయన ప్రస్తుతం రాజస్థాన్ లో ఉన్నారు. ఆ తర్వాత బృందావనం షూటింగులో పాల్గొంటారు. పెళ్లికి వారం రోజుల ముందు నుంచి సినిమా షూటింగులకు బ్రేక్ ఇవ్వాలని ఎన్టీఆర్ అనుకుంటున్నట్లు సమాచారం. పెళ్లి మేలో జరిగే అవకాశాలున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X