హైదరాబాద్: ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించింది. హైదరాబాదులోని బషీర్ బాగ్ చౌరస్తాలో ధర్నా చేసిన తెలుగుదేశం మైనారిటీ సెల్ కార్యకర్తలు సచివాలయ ముట్టడికి యత్నించారు. సచివాలయ ముట్టడికి యత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తెలుగుదేశం నాయకుడు లాల్ జాన్ పాషా విమర్సించారు. తిరుపతిలో ముస్లింలో ధర్నా నిర్వహించారు.
కాగా, మాజీ మంత్రి, కాంగ్రెసు నాయకుడు షబ్బీర్ అలీ మంగళవారం ముఖ్యమంత్రి కె రోశయ్యను కలిశారు. ముస్లిం రిజర్వేషన్ల కల్పనకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. ముస్లిం రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును పరిశీలించి సుప్రీంకోర్టుకు వెళ్లే విషయంపై అడ్వొకేట్ జనరల్ తోనూ, న్యాయనిపుణులతోనూ చర్చలు జరుపుతున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి