వైయస్ ప్రమాదంపై అనుమానాలు: టిడిపి ఎమ్మెల్యే

Telugudesam
దాచేపల్ల్లి: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి దుర్మరణంపై ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగించాలని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. స్థానిక ఆర్‌అండ్‌బీ బంగ్లాలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న సమయంలో సరైన భద్రతచర్యలను చేపట్టకపోవడంతోనే హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందారని యరపతినేని అభిప్రాయం వ్యక్తం చేశారు. వైయస్ చనిపోయి మూడు నెలలు గడిచినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెలికాప్టర్‌ సంఘటనపై ఒక స్పష్టమైన ప్రకటనను చేయలేకపోయారని యరపతినేని వ్యాఖ్యానించారు. రాష్ట్ర రాజకీయాల్లో చైతన్యాన్ని కల్గించి దేశ రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగిన వైయస్ అకాలమరణం చెందడం దురదృష్టకరమన్నారు.

రాష్ట్ర మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌, ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి టీడీపీ నాయకులపై ఆరోపణలు చేయడంపై యరపతినేని అభ్యంతరం వ్యక్తం చేశారు. వైయస్ తనయుడు జగన్‌ మోహన్‌ రెడ్డిపై తామెప్పుడు ప్రత్యక్షంగా ఆరోపణలు చేయలేదని ఆయన స్పష్టంచేశారు. రాష్ట్రంలో జగన్‌కు ఉన్న ఆదరణ చూసి భయపడాల్సిన పని టీడీపీకి లేద ని అన్నారు. టీడీపీ నాయకులను విమర్శించే ముందు కాంగ్రెసు నాయకులు తమ స్థితిగతులేమిటో ఒక్కసారి గుర్తుంచుకుని మాట్లాడాల్సిన అవసరం ఉందని యరపతినేని సూచించారు. జిల్లాలో నలుగురు రాష్ట్ర మంత్రులు, ఒక కేంద్ర మంత్రి, ఒక డిప్యూటీ స్పీకర్‌, శాసన మండలి వైస్‌ చైర్మన్‌ ఉండి నారాయణపురం పేలుళ్ళ బాధితులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారని యరపతినేని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+