హైకమాండ్ ను ఇబ్బంది పెట్టొద్దు: డిఎస్

పార్టీ అధిష్టానాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా పార్టీ నాయకులు ప్రవర్తించవద్దని ఆయన అన్నారు. తెలంగాణపై ప్రాక్టికల్ గా ఆలోచించాలని ఆయన కోరారు. విద్యార్థులకు చేతులు జోడించి నమస్కరిస్తున్నానని, ఆత్మహత్యల వల్ల తెలంగాణకు నష్టమే జరుగుతుందని ఆయన అన్నారు. పిసిసి సమన్వయ కమిటీ సమావేశం ఈ నెల 17వ తేదీన జరుగుతుందని ఆయన చెప్పారు. శాసనసభ సమావేశాలు సజావుగా సాగుతాయని తాను భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఏ స్థాయికైనా వెళ్తామని ఆయన చెప్పారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించి తీరుతామని ఆయన చెప్పారు. ముస్లిం విద్యార్థులకు ఉపకార వేతనాలు, రియంబర్స్ మెంట్ విడుదలవుతాయని, ఈ విషయంలో అపోహలు కూడదని ఆయన అన్నారు. ముస్లింలకు మతప్రాతిపదికపై రిజర్వేషన్లు కల్పించలేదని, వెనకబాటు ఆధారంగానే కల్పించామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications