వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కెకెతో కెసిఆర్, ఇతర నేతల భేటీ

శ్రీకృష్ణ కమిటీ విధివిధానాల ఖరారులో జాప్యం జరగడం, దాని కలపరిమితి కూడా తెలియకపోవడంతో తెలంగాణ రాజకీయ నేతల్లో ఆందోళన చెలరేగుతోంది. విధివిధానాల ఖరారులో జాప్యం జరగడంతో ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి వల్లనే దామోదర్ రెడ్డి శాసనసభా సమావేశాలను బహిష్కరిస్తామని అని ఉంటారని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ చెప్పారు. సీమాంధ్ర నేతలు ఢిల్లీలో తమ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్సించారు. విధివిధానాల వెల్లడిలో జాప్యం పట్ల కాంగ్రెసు నాయకుడు జీవన్ రెడ్డి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో పరిపాలనే లేకుండా పోయిందని ఆయన అన్నారు. ప్రజల్లో నమ్మకం పోతోందని ఆయన అన్నారు.