సమస్యకు పరిష్కారం చూస్తాం: శ్రీకృష్ణ

తదుపరి సమావేశంలో తమ కమిటీ కార్యాచరణను వెల్లడిస్తుందని కమిటీ మెంబర్ సెక్రటరీ చెప్పారు. రాజకీయ పార్టీలకు, వివిధ సంఘాలకు తమ కమిటీ అందుబాటులో ఉంటుందని ఆయన చెప్పారు. కమిటీ ఇప్పటికే తన పని ప్రారంభించిందని ఆయన చెప్పారు. హైదరాబాదు ఎప్పుడు వెళ్లాలనేది నిర్ణయించలేదని, కమిటీ కేంద్ర కార్యాలయం ఢిల్లీలోనే ఉంటుందని ఆయన చెప్పారు. వినతిపత్రాల రూపంలో కూడా విజ్ఞప్తులను స్వీకరిస్తామని ఆయన చెప్పారు. నిర్ణీత గడువు కన్నా ముందుగానే నివేదిక సమర్పించేందుకు ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలతో సంప్రదింపులు జరుపుతామని ఆయన చెప్పారు. అన్ని వర్గాల ప్రజలతో సమావేశమవుతామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో శాంతి నెలకొల్పడమే తమ ధ్యేయమని జస్టిస్ శ్రీకృష్ణ అన్నారు. నెలకు కనీసం రెండు సార్లయినా కమిటీ సమావేశం జరిగేలా చూస్తామని దుగ్గల్ చెప్పారు. ఎవరు ఏయే పనులు చేయాలనే కేటాయింపు జరిగిందని ఆయన చెప్పారు. తమకు అందరి సహకారం లభిస్తుందని అనుకుంటున్నామని ఆయన అన్నారు. కమిటీ సభ్యులను దుగ్గల్ మీడియా ప్రతినిధులకు తొలుత పరిచయం చేశారు.












Click it and Unblock the Notifications