తెలంగాణ తప్ప ప్రజా సమస్యలు పట్టవా? చిరంజీవి

శ్రీకృష్ణ కమిటీ కూడా అత్యధిక ప్రజల మనోభావాన్ని గుర్తిస్తుందనే ఆశాభావాన్ని చిరు వ్యక్తం చేశారు. తెలంగాణా వాదులు కమిటీ విధి విధానాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీని అడ్డుకుంటామన్న విషయాన్ని ప్రస్తావిస్తూ... కమిటీని గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం నియమించినందున కమిటీని తెలంగాణా ప్రాంత కాంగ్రెస్ సభ్యులు వ్యతిరేకిస్తారనుకోవడం లేదని, టిడిపి సభ్యులు ఫలితం రావాలని కోరుకుంటారని భావిస్తున్నట్లు చిరు అన్నారు. పది మంది సభ్యులున్న టిఆర్‌ఎస్ అడ్డుకున్నా ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన విషయంలో ఐదు దశాబ్దాల సమస్య ఐదారు రోజుల్లో ఎలా పరిష్కారమవుతుందని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications