ఆదిలాబాద్ : జిల్లాలోని జైపూర్ మండలం పెగడుపల్లిలో 600 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి రోశయ్య శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు శాతవాహన యూనివర్శిటీ జేఏసీ నాయకులు జై తెలంగాణ అంటూ నినదించగా పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ముఖ్యమంత్రి రోశయ్య తాను సమీక్యాంధ్ర వాదినని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన హయాంలో విభజన రేఖలు తీవ్రమయ్యాయి. శాంతిభద్రతల పరిస్ధితి దారుణంగా మారింది.