పుణె పేలుళ్ళ నేపద్యంలో షిర్డి అప్రమత్తం

ఇందులో అనేక మంది సిబ్బంది నామమాత్రంగా విధులు నిర్వహిస్తున్నారు. షిర్డీలో బాంబు నిర్వీర్యం బృందం ఉంది. కానీ వారికి డాగ్‌స్క్వాడ్ అందుబాటులో లేదు. ఉన్న ఒక శునకం చనిపోవడంతో దాని స్థానంలో మరో శునకాన్ని ఏర్పాటు చేయలేదు. అత్యాధునిక స్కానింగ్ యంత్రాలతోపాటు ఇతర భద్రతాపరమైన పరికరాలు సమకూర్చాలని రెండు, మూడు సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తున్నప్పటికీ పట్టించుకునే వారే కరువయ్యారు. సాయిబాబా సంస్థాన్ వద్ద 23 మెటల్ డిటెక్టర్ ప్రవేశ ద్వారాలున్నాయి. అందులో కొన్ని పనిచేయక అలంకార ప్రాయంగా మిగిలిపోయాయి. నిత్యం వేల సంఖ్యల్లో భక్తులు దర్శించుకునే షిర్డీ పుణ్య క్షేత్రంలో భద్రతా దళాలతోపాటు ఆధునిక సాంకేతిక సామాగ్రి అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.












Click it and Unblock the Notifications