పుణె పేలుళ్ళ సిసిటివి ఫుటేజ్ సేకరణ: ఐజి

ప్రత్యేక బృందం ఏర్పాటు: పుణేలోని జర్మనీ బేకరీలో శనివారంనాటి బాంబు పేలుడు ఘటనకు సంబంధించి దర్యాప్తు ప్రక్రియను వేగంగా జరిపేందుకుగాను పోలీస్ చీఫ్ ఎ.ఎన్.రాయ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటైంది. ఏటీఎస్ చీఫ్ కె.పి.రఘువంశి, ఏటీఎస్ డీఐజీ రవీంద్ర కదమ్ తదితరులను ప్రభుత్వం నియమించింది. పేలుడు కేసును వివిధ కోణాలలో దర్యాప్తు చేసేందుకు వివిధ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే ఒక బృందం ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇతర రాష్ట్రాలకు బయలుదేరిందన్నారు. మృతులందరినీ గుర్తించామని రష్మీ శుక్లా వెల్లడించారు. వీలైనంత త్వరగా ఈ కేసును ఓ కొలిక్కి తెస్తామని, నిందితులను ఎట్టి పరిస్థితుల్లో పట్టుకుతీరతామన్నారు.












Click it and Unblock the Notifications