స్పీకర్ అల్పాహార విందును బహిష్కరించిన టిడిపి

రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని సభాపతి కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం శాసనసభ్యులకు అల్పాహార విందునిచ్చారు. జూబ్లీహిల్స్‌లో ఇచ్చిన ఈ అల్పాహార విందుకు ముఖ్యమంత్రి రోశయ్య, శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి, మంత్రులు రఘువీరారెడ్డి, వట్టి వసంతకుమార్, పార్థసారథి, కన్నా లకీనారాయణ, గాదె వెంకటరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, సునీతా లక్ష్మారెడ్డి, గీతారెడ్డి, మేయర్ కార్తీకరెడ్డి తదితరులు హాజరు అయ్యారు. అలాగే సీపీఎం, పీఆర్పీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు విందుకు హాజరు అయ్యారు. ప్రతి బడ్జెట్ సమావేశాలకు ముందు సంప్రదాయం మేరకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకులకు స్పీకర్ అల్పాహార విందు ఇవ్వటం ఆనవాయితీగా వస్తోంది.












Click it and Unblock the Notifications