రాష్ట్రంలో ఐటి సేవలు ఇక నిత్యావసర పరిశ్రమగా గుర్తింపు

ఈ సందర్భంగా సోమ్ మిట్టల్ మాట్లాడుతూ, ఆందోళనల నేపథ్యంలో ఐటీ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలా? వద్దా? అన్న సంశయంలో ఉన్నాయని తెలిపారు. పెట్టుబడులు తరలించకుండా ఆయా కంపెనీలతో నాస్కామ్ సంప్రదింపులు జరుపుతోందని వివరించారు. ఐటీ విధానంలో స్పష్టం చేసిన విధంగా ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలను నిత్యావసర పరిశ్రమల చట్టం కిందకు తీసుకురావాలని సీఎంను కోరారు. దీని వల్ల ఆందోళనల సమయంలో పోలీసులు, ఇతర బలగాలు వేగంగా తరలించేందుకు వీలు ఉంటుందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications