వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కడప రహదారులకు వైఎస్ కుటుంబసభ్యుల పేర్లు

కడపలో కృష్ణా థియేటరు నుంచి చిన్నచౌకు బైపాస్ వరకు గల రోడ్డుకు వైఎస్ పేరు పెట్టారు. మరో ప్రత్యేక రహదారి ఏడురోడ్ల కూడలి నుంచి వన్‌టౌన్ వరకు గల మార్గానికి ఎమ్మెల్సీ వైఎస్.వివేకానందరెడ్డి పేరు. ఆర్టీసీ బస్టాండు కూడలి, ఎస్పీ బంగ్లా నుంచి చెన్నై రోడ్డును కలిపే లింకు రోడ్డుకు వైఎస్.జగన్ మోహన్ రెడ్డి పేరు, జిల్లా పరిషత్ నుంచి మురళీథియేటరు కూడలి వరకు గల మార్గానికి వైఎస్ బామ్మర్ది నగర మేయరు పి.రవీంద్రనాథ్‌రెడ్డి పేరు, బస్టాండు నుంచి రాజీవ్ మార్గ్ వెళ్లే దారికి ఒకప్పటి కలెక్టరు సుబ్రమణ్యం పేరు, చెన్నై రోడ్డు, మినీ బైపాస్‌లను కలిపే ముత్తరాసుపల్లె రోడ్డుకు పోలీసు అధికారి వెస్లీ పేరును పెట్టారు.