హైదరాబాద్: శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయాన్ని వరల్డ్ నెంబర్ వన్ అంత ర్జాతీయ విమానాశ్రయంగా ఎయిర్‌పోర్టు ఇంటర్నేషనల్ గుర్తించింది. జిఎంఆర్ సంస్ధ దీనిని నిర్మించింది. దీనికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరు పెట్టారు. ఇది దేశంలోనే తొలి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు. ఏడాదికి 12 మిలియన్ ప్రయాణికులను హ్యాండిల్ చేసే సామర్ధ్యం దీనికి ఉంది. దేశంలోనే పొడవైన 4.26 మీటర్ల రన్ వే ఇక్కడ ఉంది. 3000 కార్లు పెట్టగలిగే గొప్ప పార్కింగ్ సదుపాయం ఇక్కడ ఉంది.