హైదరాబాద్: ఒక ప్రాంతానికి అనుకూలంగా డిప్యూటీ స్పీకర్ వ్యవహరిస్తున్నారంటూ నాగం జనార్థన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో బుధవారం సభలో గందరగోళం నెలకొంది. సభాపతిపై నాగం చేసిన వ్యాఖ్యలను అన్ని పార్టీలు తప్పుబట్టాయి. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని అన్ని పార్టీల సభ్యులు కోరారు.
అంతకు ముందు నాగం జనార్థన్ రెడ్డి తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే మాట్లాడేందుకు అవకాశం ఇవ్వనని ఉప సభాపతి నాదెండ్ల మనోహన్ స్పష్టం చేశారు. అయితే తాను చేసిన వ్యాఖ్యల్లో అభ్యంతరమేమీ లేదని నాగం సమర్థించుకున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి