NEET UG 2026: నీట్ పరీక్ష రాసే అభ్యర్ధులకు అలర్ట్-NTA కీలక సూచనలు..!

దేశవ్యాప్తంగా వైద్య విద్య సంస్థల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్ష (NEET UG 2026)కోసం సర్వం సిద్దమైంది. ఈ కీలకమైన ప్రవేశ పరీక్షకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ స్ధానిక అధికారుల సాయంతో భారీ ఏర్పాట్లు చేస్తోంది. అలాగే నీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులకు కీలక సూచనలు జారీ చేసింది. వీటిని తప్పనిసరి గా పాటించాలని వారికి సూచిస్తోంది. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండబోవని కూడా స్పష్టం చేసింది.

ఈసారి దేశవ్యాప్తంగా 22.79 లక్షల మంది విద్యార్ధులు నీట్ పరీక్ష రాస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకూ ఈ పరీక్ష జరగబోతోంది. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు మధ్యాహ్నం 1.30 లోపే నీట్ పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఎన్డీయే సూచించింది. 1.30 గంటలు దాటితే పరీక్షా కేంద్రాల్లో గేట్లు మూసేస్తారు. దేశంలోని పలు చోట్ల ఆదివారం వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తోంది.

NEET UG 2026 Exam Tomorrow NTA Issues Key Instructions Every Aspirant Must Read Tonight

వర్షాల కారణంగా అడ్మిట్ కార్డులు, ఫొటోలు తడిచిపోకుండా చూసుకోవాలని అభ్యర్ధులకు ఎన్టీఏ సూచిస్తోంది. విద్యార్ధులకు ఎలాంటి సందేహాలు ఉన్నా వెంటనే 011-40759000 లేదా 011-69227700 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించింది. లేదా [email protected] కు మెయిల్ కూడా చేయొచ్చని అభ్యర్ధులకు ఎన్డీయే తెలిపింది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా భారీ ఎత్తున పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు భారీ భద్రత కూడా ఏర్పాటు చేస్తున్నారు. గతానుభవాల్ని దృష్టిలో ఉంచుకుని పేపర్ లీక్ లు, మాస్ కాపీయింగ్ లు జరగకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+