న్యూఢిల్లీ: న్యూఢిల్లీ వెళ్ళిన తెలంగాణ కాంగ్రెసు నేతల కథ ఇంకా కంచికి చేరలేదు. కాంగ్రెసు రాష్ట్రవ్యవహారాల ఇన్ ఛార్జి వీరప్ప మొయిలీతో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, ముత్యంరెడ్డి, మహేశ్వరెడ్డిలు మంగళవారం మొయిలీతో సమావేశమయ్యారు. జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలోని ఏర్పాటైన కమిటీ విదివిధినాలపై చర్చించారు. మొయిలీతో భేటీ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.ప్రస్తుతం ఉన్న కమిటీ విదివిధినాల్లో మార్పులుంటాయని ఆశిస్తున్నామని దామోదర్ రెడ్డి తెలిపారు.
బుధవారం సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ తో భేటీ అయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అహ్మద్ పటేల్ తో భేటీ తర్వాతే తుది నిర్ణయం తెలుపుతామని దామోదర్ రెడ్డి తెలిపారు. జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలోని కమిటీ అనంతరం తెలంగాణాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి విదితమే.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి