బందరు, నూజివీడుల్లో బ్లూఫిల్ములు స్వాధీనం

krishna Dist
మచిలీపట్నం: జిల్లాలోని నూజివీడులో వీడియోషాపులపై ఏఎస్పీ ఆకస్మికంగా దాడి చేయడంతో పైరసీచిత్రాల గుట్టురట్టయ్యింది. బుధవారం ఏఎస్పీ సమక్షంలో పోలీసులు నాలుగు షాపులపై దాడి చేయడంతో భారీ ఎత్తున నీలి చిత్రాలు, పైరసీ చిత్రాలు లభ్యమయ్యాయి. దీంతో వాటిని ఏఎస్పీ స్వాధీనం చేసుకుని,ఆ షాపులను సీజ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఆషాపులకు సంబంధించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

మచిలీపట్టణంలోని వీడియో, సెల్‌ఫోన్‌ షాపులపై బందరు టౌన్‌ సీఐ జీవీ రమణమూర్తి బుధవారం దాడి చేశారు. ఈ దాడుల్లో 111 నీలిచిత్రాల సీడీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రామానాయుడుపేటలోని కాప్స్‌ మ్యూజిక్‌ అండ్‌ మూవీస్‌, సంగీత వీడియోస్‌, బచ్చుపేటలోని సాయివెంకట మ్యూజికల్స్‌పై ఏకకాలంలో పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో కాప్స్‌మ్యూజిక్‌షాపు నుంచి 10 సీడీలు, సాయివెంట మ్యూజికల్స్‌ నుంచి 92, సంగీత వీడియో నుంచి 9సీడీలు స్వాధీనం చేసుకున్నారు.

కాప్స్‌ మ్యూజిక్‌ యజమాని ఏడుంబాగుల రామకుమార్‌, సాయివెంకట మ్యూజికల్స్‌ యజమాని గడ్డం అశ్వనీకుమార్‌, సంగీత వీడియోస్‌ యజమాని నుడగల శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో ఆర్‌పేట, ఇనగుదురు, చిలకలపూడి ఎస్సైలు పీ రామచంద్రరావు, వైవీ రమణ, బీ పెద్దిరాజులు, సిబ్బంది పాల్గొన్నారు. వీడియోషాపులపై పోలీసులు దాడి చేస్తున్నారనే సమాచారం అందటంతో మిగిలిన వీడియోషాపు యజమానులు షాపులకు తాళాలు వేసి జారుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+