కాపీరైట్ సవరణ కమిటీకి అమీర్ ఖాన్ రాజీనామా

కమిటీ సమావేశంలో అమీర్ చేసిన వ్యాఖ్యలపై గీత రచయిత జావేద్ అఖ్తర్ తీవ్రంగా విభేదిస్తూ 'ఖయామత్ సే ఖయామత్ తక్' సినిమాలో 'పాపా కెహతే హై' పాట ప్రాచుర్యం పొందిన విషయాన్ని ప్రస్తావించారు. అప్పటికి అమీర్ కొత్త నటుడే అన్న విషయాన్ని గుర్తు చేశారు. సంగీతకారులకు కూడా రాయల్టీలో వాటా దక్కాలని ఆయన వాదించారు. అమీర్ మాత్రం నిర్మాతల పక్షం వహించారు. ఈ పరిణామాలే ఆమిర్ రాజీనామాకు దారి తీశాయి. సంగీత, సినిమాటోగ్రాఫిక్, సాహిత్య కళారూపాలను వాణిజ్య పరంగా వినియోగిస్తే వాటి రూపకర్తలకు రాయల్టీ చెల్లించాలని కాపీరైట్ చట్ట సవరణలు ప్రతిపాదించాయి.












Click it and Unblock the Notifications